ఎంత పెద్ద చదువులు చదివిన వారు అయినా కూడా ఏదో ఒక సమయంలో మోస పోడం అనేది జరుగుతూనే ఉంది. ఉన్నత చదువులు చదివి బ్యాంకుల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్న ఎంతో మందిని 7 సెన్స్ ఇంటర్నేషనల్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ మోసం చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 429 మంది ఈ రియల్‌ ఎస్టేట్ సంస్థ చేతిలో మోసపోవడం జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చీటింగ్‌ లో ప్రస్తుత టీఎంసీ ఎంపీ, ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ నుస్రత్‌ జహాన్ ఉండటంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రియల్‌ ఎస్టేట్ సంస్థ అపార్ట్‌మెంట్‌ లో ప్లాట్ లు ఇస్తామంటూ డబ్బులు వసూళ్లు చేసి ఇప్పుడు మొండి చేయి చూపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం లో హీరోయిన్‌ నుస్రత్‌ జహాన్‌ కీలకం అవ్వడంతో ప్రస్తుతం ఈడీ విచారణ జోరుగా సాగుతుంది. 


ప్రస్తుతం మెంబర్‌ ఆఫ్ పార్లమెంట్‌ అయిన నుస్రత్‌ జహాన్‌ ను ప్రత్యేకంగా విచారిస్తున్నట్లుగా ఈడీ అధికారులు చెప్పుకొచ్చారు. వందలాది మందిని చీటింగ్ చేసిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నటి నుస్రత్‌ జహాన్‌ పై కేసులు నమోదు అవ్వడం జరిగింది. బీజేపీకి చెందిన ఒక నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు తో ఈడీ అధికారులు ఎంక్వౌరీ చేయడం మొదలు పెట్టగా మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. 


Also Read: Beauty Parlour: భర్త కోరికతో బ్యూటీపార్లర్‌కు వెళ్లిన మహిళ.. చివరకు ఊహించని షాక్..!  


సదరు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ డైరెక్టర్ లలో నుస్రత్‌ జహాన్ ఒకరు కావడంతో విషయం మరింత సీరియస్ గా మారింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోల్‌కత్తా శివార్లలో తమకు అపార్ట్‌మెంట్‌ లో ప్లాట్‌ లు ఇప్పించినందుకు గాను ఇండియన్ ఓవర్సీస్‌ బ్యాంక్‌ లోని 429 మంది ఉద్యోగులను సదరు రియల్‌ ఎస్టేట్ సంస్థ మోసం చేసినట్లుగా తెలుస్తోంది.


9 ఏళ్ల క్రితం 5.5 లక్షల రూపాయలు తీసుకున్న రియల్‌ ఎస్టేట్ కంపెనీ ఇప్పటి వరకు కూడా డబ్బును తిరిగి ఇవ్వడం కానీ ఆ డబ్బుకు సమానమైన ప్లాట్స్ ను కానీ ఇవ్వలేదు. దాంతో కేసు నమోదు చేసినట్లుగా బాధితులు పేర్కొన్నారు. రియల్‌ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్ లు ఇతర యాజమాన్యం పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. 


ఇండియన్ ఓవర్సీస్‌ బ్యాంకు లో మొత్తం 429 మందితో ఒప్పందాలు కుదుర్చుకున్న రియల్‌ ఎస్టేట్ సంస్థ వారందరిని కూడా మోసం చేసింది. ఇప్పటికే అందులో కొందరు రిటైర్‌ అవ్వగా కొందరు ఇంకా విధుల్లో కొనసాగుతున్నారు. తమకు న్యాయం చేయాలని.. తమ డబ్బు తమకు ఇప్పించాలని కోర్టును ఉద్యోగస్తులు కోరుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎంపీ నుస్రత్‌ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.


Also Read: IND Vs WI Dream11 Tips: విండీస్‌తో నేడు తొలి టీ20.. డ్రీమ్ 11 టిప్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇలా..   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook